లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ ఆగాయి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలతో షూటింగ్‌లకు పర్మిషన్స్ ఇవ్వడంతో మన స్టార్స్ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ కోవలో హీరో నితిన్ 'రంగ్‌దే' సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఇటలీలో 'రంగ్ దే' చిత్రీకరణ జరుపుకోనుందని సినీ వర్గాల సమాచారం. దీంతో పాటు నితిన్ తదుపరి సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్ తెలియజేశారు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్‌లు లొకేషన్ వేటలో బిజీ బిజీగా ఉన్నారట. గోవా తదితర ప్రాంతాల్లో లొకేషన్ వేట కొనసాగుతోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాదున్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ రీమేక్ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నికితా రెడ్డి, ఎన్.సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమాలో నభానటేశ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Scouting for locations in Goa for @AndhadhunFilm remake with Director @MerlapakaG Pre-production going at a fast pace. pic.twitter.com/NIopXJdPxC
— Sahi Suresh (@sahisuresh) October 5, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa