ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొబైల్ లేకున్నా వాట్సాప్‌ వీడియో కాల్స్!

Technology |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:38 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లు అందుబాటులో లేకపోయినా.. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా నేరుగా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ కాల్స్‌లో ఒకేసారి 32 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోకుండానే కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో కాల్స్‌కు కనెక్ట్ కావచ్చు. ఈ ఫీచర్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa