ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈలోపు ఫీజులు చెల్లించే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. అంటే 14 శాతానికి బదులు 7 శాతం చెల్లిస్తే సరిపోతుంది. గడువు దాటితే పూర్తి ఫీజుతో పాటు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన వారు వెంటనే LRS వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa