దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక లోపల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. మాక్రాన్ సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా డొనాల్డ్ ట్రంప్‌నకు ఏదైనా సందేశం ఇస్తున్నారా? లేక ఇది కేవలం ఫ్యాషనా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ చర్చకు మాక్రాన్ స్వయంగా తెరదించారు. తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందని, అందుకే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఇదివరకు ఫ్రాన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన కన్ను ఎర్రగా వాచి కనిపించింది. ఆ సమయంలో కూడా ఆయన కొంతసేపు కళ్లద్దాలు ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa