ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రీట్మెంట్ తీసుకుంటున్న నితిన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 12:10 PM

యంగ్ హీరో నితిన్ చేసిన తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ ఏప్రిల్ 5న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. గత చిత్రం ‘లై’ భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో నితిన్ కూడ ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.ఇకపోతే ‘ఛల్ మోహన్ రంగ’ షూటింగ్ సమయంలో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు నితిన్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో నితిన్ దాన్ని తేలిగ్గా తీసుకున్నా తర్వాత తర్వాత నొప్పి తీవ్రమవడంతో వైద్య పరీక్షలు చేయించుకుని గత కొన్ని రోజుల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట నితిన్. త్వరలోనే ఈ ట్రీట్మెంట్ పూర్తై సినిమా విడుదల లోపల నితిన్ పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa