ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్కను చూసి బయపడుతున్నాడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 09:03 AM

అతి తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెన్నెల కిషోర్. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ ప్రేక్షకులు ఎంతో దగ్గరైన ఈ యాక్టర్ చాలా వరకు అందరికి నచ్చుతాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనోడి ఫాలోవర్స్ సంఖ్య పెద్దగానే ఉంది. కిషోర్ తన ఫ్యాన్స్ కి చాలా వరకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎలాంటి కామెంట్స్ వచ్చినా సరే చాలా ఫన్నీ గా రిప్లై ఇస్తుంటాడు. అయితే ఎవరు ఊహించని విధంగా ఒక హారర్ మూవీని చూస్తూ కిశోర్ ఒక్కడే బయపడుతుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హారర్ సినిమా మరేదో కాదు. రీసెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ను కుమ్మేసిన భాగమతి. అనుష్క కు సంబందించిన హారర్ సీన్ ను చూస్తూ కిషోర్ ఇచ్చిన హావభావాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. అమెజాన్ లో సినిమా చూస్తున్నట్లు అందుకు సంబందించిన వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. 


చూస్తుంటే కిశోర్ షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈ కమెడియన్ నాగ చైతన్య చేస్తోన్న రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. మారుతి  దర్శకత్వంలో వస్తోన్న శైలజా రెడ్డి అల్లుడితో పాటు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవ్యాసాచిలో కూడా నటిస్తున్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa