ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోల్ అనుష్క చేస్తే బాగుంటుందనే

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 02:47 PM

ఈ తరంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కయే. అప్పట్లో వచ్చిన అరుంధతి నుంచి మొదలెట్టి రీసెంట్ గా వచ్చిన భాగమతి వరకు అనుష్క ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశ పరచలేదు. స్వీటీ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు స్టార్ హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు వచ్చాయంటే ఆమెకున్న ఇమేజ్ తెలిసిపోతుంది. ఏ తరహా పాత్ర అయినా అది అనుష్క అయితేనే న్యాయం చేయగలదన్న నమ్మకం టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లోనూ పెరిగింది. 


తమిళంలో రీసెంట్ గా జ్యోతిక మెయిన్ లీడ్ గా నాచియార్ సినిమా వచ్చింది. డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న బాలా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా బాగానే ఆడటంతో దాదాపు రూ. కోటికి కాస్త తక్కువ ఇచ్చి ఈ మూవీ రైట్స్ తీసుకున్నారు. నాచియార్ ను డబ్బింగ్ చేద్దామని రైట్స్ తీసుకున్న వారు అనుకున్నప్పటికీ దానికి బదులు రీమేక్ చేస్తే మంచిదని ఆ మూవీ డైరెక్టర్ బాలా వారికి సలహా ఇచ్చాడట. ఈ రోల్ అనుష్క చేస్తే బాగుంటుందనే సలహా కూడా ఆయనే ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో హక్కులు దక్కించుకున్న నిర్మాతలు అనుష్కను కలిసి ఆమెను ఒప్పించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. 


అనుష్క ఇంతవరకు చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ స్ట్రయిట్ సినిమాలే. హీరో పక్కన ఆడిపాడే కమర్షియల్ సినిమాల్లో రీమేక్ లు ఉన్నా హీరోయిన్ మెయిన్ లీడ్ గా ఉన్న సినిమాలేవీ చేయలేదు. దీంతో నాచియార్ కు అనుష్క ఓకే చెబుతుందా లేదా అన్నదానిపై నిర్మాతలు సందేహపడుతున్నారు. ఆమె కాదంటే డబ్బింగ్ చేయడమే. ఇంకో మార్గం లేనట్టే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa