టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీల్లో ప్రస్తుతం ఎక్కువగా నార్త్ భమలే ఉంటారని అందరికి తెలిసిందే. రెండు మూడు హిట్స్ పడ్డాయంటే ఇక్కడే మకాం వేసేస్తారు. స్టార్ హీరోల రేంజ్ లో అవకాశాలు దక్కాయి అంటే ఓ విల్లా లేదా బిల్డింగ్ సెట్ చేసుకొని టాలీవుడ్ లోనే పదేళ్ల వరకు ఉండిపోతారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. పరబాషలో అవకాశాలు అందుకోవడానికి ఇక్కడ స్టార్ డమ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. చాలామంది నార్త్ అమ్మాయిలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లినవారే.
హిట్స్ అందితే పరవాలేదు గాని ఏ మాత్రం డిజాస్టర్ అందినా మళ్లీ సౌత్ కి షిప్ట్ అవ్వడం హీరోయిన్స్ కి అలవాటే. రీసెంట్ గా ఓ హిరోయిన్ కూడా అలానే చేస్తోందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ మొదట్లో బాలీవుడ్ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అక్కడ హిట్స్ అందకపోవడంతో టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకొని స్టార్ట్ హీరోయిన్ అయ్యింది. ఏ మాత్రం తగ్గకుండా రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ వరుసగా హిట్స్ వస్తుండడంతో అమ్మడి మనసు బాలీవుడ్ కి మళ్లింది. అలా బాలీవుడ్ లో సినిమాను ఒప్పుకుందో లేదో ఇక్కడ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. దీంతో బాలీవుడ్ అయ్యారి సినిమాతో హిట్ అందుకోవాలని ఎప్పుడు లేని విదంగా ప్రమోషన్స్ చేసింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ తెలుగువైపు చూస్తోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తెలుగుపై అందరు ఆకర్షించేలా కామెంట్స్ చేసింది. నాకు మొదట్లో తెలుగు వచ్చేది కాదు. కానీ తెలుగు అభిమానులు నన్ను తెలుగు అమ్మాయిలా చూడటంతో వెంటనే తెలుగు భాష నాకు సెట్ అయిపోయింది. మా ఇంట్లో ఉన్నపుడు కూడా ఒక్కోసారి సడన్ గా తెలుగులోనే మాట్లాడేస్తున్నా అంటూ.. తెలుగు ఆడియెన్స్ నన్ను అంతగా ఆదరించారు అనే లెవెల్లో డైలాగ్స్ వదిలింది. దీంతో నార్త్ డిజాస్టర్ ఇవ్వడంతో మళ్లీ సౌత్ వైపు మనసు మార్చుకుంది అనేలా ఓ వర్గం వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa