ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకొచ్చిన ఢిల్లి సుందరి రాశీ ఖన్నా. రాగానే ముందుగా అందంతో అందరినీ పడేసింది. నటిగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. చాలా చిన్న వయసులో నాయిక కావడం వల్ల…పరిశ్రమలో ఆమెకంటూ ఓ ప్రత్యేక స్థానం దొరికింది. కుర్ర కథానాయకులతో పాటు కొత్తదనాన్ని కోరుకునే పేరున్న హీరోలతోనూ నటించింది. రెండు తరాల కథానాయకులతో నటిస్తూ తన అవకాశాల పరిధి పెంచుకుంది రాశీ ఖన్నా. ఇలా రెండు తరాల కథానాయకులతో మెప్పించడం వల్ల ఒకరితో సినిమా ఆడౖకున్నా…మరో కథానాయకుడితో విజయాన్ని అందుకుంటోంది. ఇటీవల రాశీ రవితేజతో కలిసి నటించిన టచ్ చేసి చూడు సినిమా అపజయం పాలైంది.
ఇంతలో వరుణ్ తేజ్ సరసన నటించిన తొలి ప్రేమ మంచి విజయాన్ని అందించింది. ఇలా నట ప్రయాణాన్ని సమతూకం చేసుకునే ఆస్కారం ఈ భామకు దక్కుతోంది. ఇలాంటి ప్రత్యేకమైన ప్రయాణంలో ఇతర నాయికల నుంచి పోటీ సాధారణంగానే ఉంటుంది. అయితే తాను అలాంటి పోటీ గురించి ఆలోచించడం లేదంటోంది రాశీ ఖన్నా. తనకున్న ప్రతిభకు, అందానికి ఎక్కువే పేరు వచ్చిందంటోంది. వచ్చిన గుర్తింపుతో సంతృప్తి పడతానని చెబుతోంది. రాశీ మాట్లాడుతూ…ఈతరం నాయికల్లో కామెడీ చేస్తున్నది నేనే కావొచ్చు. ఇది కావాలని కోరుకున్నది కాదు. అలాంటి అవకాశాలు వస్తున్నాయి. ప్రతి చిత్రానికీ ఎదుగుతున్నాను. నా తోటి నాయికలు చాలా మంది మంచి మిత్రురాళ్లే. వాళ్లతో కలిసి పార్టీలు చేసుకుంటాను. పోటీ అనేది నేను పట్టించుకోను. నా ప్రతిభకు నాకు దక్కాల్సింది దక్కుతుంది. ఇదే అదృష్టమనుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. మరొకరిని పోటీగా భావించాల్సిన అవసరం లేదు. అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa