స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ రొమాంటిక్ ఫోటోలు వీడియోలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఇద్దరూ ఎంతో రొమాంటిక్ గా ఉన్న త్రోబ్యాక్ ఫోటోలు జంట గోల్స్ ని ఫిక్స్ చేశాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. వాలెంటైన్స్ డేకి చాలా ముందు.. ప్రేమలో ఉండటం కంటే అందమైనది ఏదీ లేదని నిరూపించే టాప్ 5 రొమాంటిక్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక వృత్తి పరంగా బిజీగా ఉండడం వల్లనే ఇంకా పెళ్లి మాటెత్తడం లేదని ఇంతకుముందు విఘ్నేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కనీసం లాక్ డౌన్ లో అయినా ఆ మాటెత్తలేదు. అంటే ఇంకా అందుకు చాలా సమయం పడుతుందనే దీనర్థం. నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమికులు మాత్రమే కాదు.. వృత్తిపరమైన వ్యవహారాల్ని కూడా పంచుకుంటారు. విఘ్నేష్ `రౌడీ పిక్చర్స్` బ్యానర్ కు నయన్ అండగా నిలుస్తోంది. సమంత అక్కినేని- విజయ్ సేతుపతితో కలిసి విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న `కాతు వాకులా రేండు కదల్`లో కూడా నయన్ కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa