సినిమా షూటింగ్ లో భాగంగా స్టంట్ కోసం ఓ పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ గాయపడ్డారు. బోస్టన్ నగర సమీపంలో 'డోన్ట్ లుక్ అప్' సినిమా చిత్రీకరణ సాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టంట్ చేస్తున్న సమయంలో గాజు పగిలి లారెన్స్ కంటి వద్ద గాయమైంది. ఈ ప్రమాద ఘటనతో 'డోన్ట్ లుక్ అప్' సినిమా చిత్రీకరణను నిలిపివేశారు. లియోనార్డో డికాప్రియోతో కలిసి జెన్నిఫర్ లారెన్స్ 'డోన్ట్ లుక్ అప్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa