తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శరత్‌కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి తహతహలాడుతోంది. రాజకీయాల్లోకి రావడం లేటైనా ఏదో రోజు పక్కాగా పార్టీ జెండా మోస్తానంటుంది యంగ్ బ్యూటీ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టింది వరలక్ష్మి. నటిగా వరుస సినిమాల్లో నటిస్తూనే ‘సేవ్‌శక్తి’అనే సంస్థను నెలకొల్సి దాని ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టింది వరలక్ష్మి. అయితే ఇప్పటికే తన తండ్రి శరత్ కుమార్ ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ’ పేరుతో తమిళనాడులో పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. అయితే తండ్రి పార్టీలో తనయ కీలకంగా మారుతుందా? లేక వేరే పార్టీలోకి వెళ్తుందా అన్ని విషయాలు పక్కడపెడితే మున్ముందు తన జర్నీ పొలిటికల్ రంగు పులుముకోవడం మాత్రం ఖాయం అంటుంది.
ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వరలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉండాలని అందుకు వారికి అవసరమైన మంచి చేయాలన్నదే తన లక్ష్యం అన్నారు. తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవల రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని అయితే రాజకీయాల్లోకి ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చన్నారు. అయితే ప్రజలకు మంచి చేసే లక్ష్యం ఉన్నవాళ్లందరికీ ఇదో మంచి మార్గం అన్నారు. ఇక విశాల్‌తో ప్రేమ వ్యవహారం, ఆపై జరిగిన పరిణామాలపై మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని వరలక్ష్మి.. విశాల్ పాలిటిక్స్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa