రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న వైవిధ్యభరిత చిత్రం `రంగస్థలం 1985`. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ నెల చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు సోదరుడిగా నటిస్తున్న ఆదిపినిశెట్టి పోస్టర్ విడుదలైంది. అప్పటి హెయిర్‌స్టైల్, కళ్లజోడుతో ఆదిపినిశెట్టి ఫోటో గమ్మత్తుగా ఉంది. `లాంతరు` గుర్తుతో ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నట్టున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ బధిరుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa