ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ సిక్స్ ప్యాక్‌తో పాన్ ఇండియా ప్రభాస్ ?

cinema |  Suryaa Desk  | Published : Mon, May 24, 2021, 01:49 PM

బాహుబలి సినిమాలో ప్రభాస్ కండలు చూశారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా బాహుబలి-2 క్లైమాక్స్ లో ప్రభాస్ ఫిజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ తర్వాత సాహోలో ఓ సీన్ లో కనిపించాడు. ఆ సంగతి పక్కనపెడితే.. మళ్లీ ప్రభాస్ ఎప్పుడు తన కండలు, సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నాడు. దీనికి సమాధానం సలార్.


అవును.. సలార్ సినిమా కోసం ప్రభాస్ మరోసారి కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు. సినిమాకు అత్యంత కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నాడు. దీని కోసం త్వరలోనే ప్రభాస్ ప్రిపేర్ అవ్వబోతున్నాడు.కంప్లీట్ యాక్షన్ మూవీగా రాబోతోంది సలార్. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ఇప్పటికే బయటకొచ్చింది. అయితే దానికి పూర్తి భిన్నమైన లుక్ ఒకటి సినిమాలో ఉంది. అది ఈ సిక్స్ ప్యాక్ లుక్ అంటున్నారు యూనిట్ జనాలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa