టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టులో ఐటెం సాంగ్ ఉందని ఇప్పటికే అప్‌డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఐటెం సాంగ్ లో ఏ భామ మెరువబోతుందోనని సినీ లవర్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ దిశా పటానీ ఈ మాసీ డ్యాన్స్ నంబర్ కు స్టెప్పులేయబోతుందని టాక్. ఆడియెన్స్ లో క్యురియాసిటీని పెంచేస్తున్న ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేయబోతుంది దిశాపటాని. అయితే దీనిపై పుష్ప టీం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ న్యూస్ కన్ఫామ్ అయితే సిల్వర్ స్క్రీన్ పై బన్నీ-దిశాపటాని ఐటెం సాంగ్ తో ఎలా ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa