ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గని మూవీ కోసం హాలీవుడ్ యాక్షన్ సీన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 26, 2021, 12:26 PM

వరుణ్ తేజ్ పై బాక్సింగ్ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారు. పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ - లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కానుంది. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa