నిఖిల్ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో “18 పేజెస్” కూడా ఒకటి. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.మరి ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్సమెంట్ పై అప్డేట్ ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా వదిలారు. ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లో టెక్నాలజీని చూపిస్తూ మరో పక్క చేతిలో పెన్ పట్టుకొని ఒక పేజ్ పై రాస్తున్నట్టుగా సుకుమార్క్ చూపించారు. అలాగే ఇందులోనే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే జూన్ 1న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాణం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa