ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదు.కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. కరోనా పరమైన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. సయీ మంజ్రేకర్ .. శోభితా ధూళిపాళ్ల .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa