మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమా విడుదల తేదీని ఉగాది పర్వదినం సందర్భం చిత్ర యూనిట్ ప్రకటించింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘మహానటి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది.
మిక్కి జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో అగ్ర తారాగణం వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఇతర కీలకపాత్రల్లో మోహన్‌బాబు, నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకుడు క్రిష్ తదితరులు కనిపించబోతున్నారు. ‘అతిలోక సుందరి-జగదేక వీరుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ ‘మహానటి’ సినిమాను నిర్మిస్తుండడం.. అగ్ర తారాగణం ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa