మెగా హీరో నటించిన ‘రంగస్థలం’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయిన విషం తెలిసిందే. ఈ ట్రైలర్ చూసిన దర్శకులు, నిర్మాతలు హీరో రామ్ చరణ్‌ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమను హత్తుకున్నాయని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పందించారు. చిట్టిబాబు తనకు మరింత దగ్గరయ్యాడని ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ట్రైలర్ చూసిన తర్వాత చరణ్‌పై తనకున్నఆప్యాయత చాలా పెరిగిందని పేర్కొన్నారు. జగపతి బాబు పాత్ర చాలా బాగుందని, తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ కోసం తను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఆదివారం రాత్రి 11.21 నిమిషాలకు ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు తెగ లైక్స్ కొడుతూ షేర్లు చేస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
Chittibabu is becoming dearer and dearer.. Trailer did only increase the affection towards him. JB is menacing. Eagerly waiting for the release.. #Rangasthalam https://t.co/KLoFvhqWXW
— rajamouli ss (@ssrajamouli) March 19, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa