భోపాల్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్కాశర్మ, హీరో వరుణ్‌ధావన్‌లు నటిస్తున్న నూతన చిత్రం ‘సూయీ థాగా’ షూటింగ్ మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. ఈ నేపధ్యంలో భోపాల్‌లోని హలాల్‌పుర్ బస్టాండ్‌లో సాధారణ చీర ధరించి అనుష్క షూటింగ్‌లో పాల్గొంది. ఇక్కడ ఈ చిత్రంలోని కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ థీమ్‌తో నిర్మితమవుతున్నఈ సినిమాను రియల్ లొకేషన్లలో చిత్రిస్తున్నట్టు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి శరత్ కటారియా దర్శకత్వం వహిస్తున్నారు. చందేరీ చీరల తయారీలోని కష్టనష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అనుష్కశర్మను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa