మొరాకో బ్యూటీ నోరా ఫతేహి పలు చిత్రాల్లో తన నటన, డ్యాన్స్‌తో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ‘బాహుబలి-1’ చిత్రంలో ‘మనోహరి’ ఐటమ్ సాంగ్ ఆమెకు మంచి గుర్తింపు సాధించిపెట్టింది. తాజాగా ఈ ఐటమ్ గర్ల్ బెల్లీ డ్యాన్స్‌లోనూ తన ప్రావీణ్యాన్ని చాటుకుంది. నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa