ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజున మెగా అభిమానులకు ఓ పండుగ రోజు. అదేసమయంలో ఈ రోజున మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేసేలా చిరంజీవి ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం "లూసిఫర్"ను తెలుగులోకి రీమేక్ చేనున్నారు. ఈచిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అదే రోజు విడుదల చేసేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే మిగిలివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa