టీవీ యాంకర్ శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఇప్పటికే తెలంగాణ మహిళా ఐక్య వేదిక మండిపడింది. సినిమాలో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని మహిళలు అభ్యంతరాలు తెలిపారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ, ఈ సినిమా విడుదల కావడంతో థియేటర్ వద్ద మహిళల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. 'క్రేజీ అంకుల్స్' చిత్ర పోస్టర్లను మహిళలు తగులబెట్టారు. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు వచ్చిన ఈ సినిమా నటులు రాజా రవీంద్ర, మనోను మహిళలు అడ్డుకున్నారు. ఈ సినిమాలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా సీన్లు ఉన్నాయని మండిపడ్డారు. సమజాంలో దంపతుల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలను తీయడమేంటని ప్రశ్నిస్తూ మహిళలు ఆందోళన చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa