పామూరులో, శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను మండల బిజెపి నేతలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంలో అట్టడుగు వర్గాల జీవితాల్లో సంస్కరణలు తీసుకువచ్చిన తొలి వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, విద్య కుల, లింగ వివక్ష నుండి విముక్తి పొందే ఆయుధం అని ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa