టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున ఆడిన పాండ్యా, తన కెరీర్‌లో తొలి లిస్ట్-ఏ సెంచరీతో చెలరేగిపోయాడు. శనివారం నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు.ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 20 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, తొలుత ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులు రాబట్టి కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.మొత్తం 92 బంతులు ఎదుర్కొన్న పాండ్యా, 11 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 50 ఓవర్లలో 293 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పాండ్యా మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లతో రాణించాడు.గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో బరోడా తరఫున ఇదే అతనికి తొలి మ్యాచ్. న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత వన్డే జట్టును ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో పాండ్యా సెంచరీ చేయడం టీమిండియాకు శుభవార్తగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa