ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 02:12 PM

AP: ప్రభుత్వం నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa