ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలలో కాంబినేషన్ అనేది చాలా యూజ్ అవుతోంది. ఒక్కసారి కలిసి హిట్టు కొట్టేస్తే వెంటనే వరుసగా ఓ నాలుగైదు ప్రాజెక్టులు ఆ కాంబోలో సెట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తారు. కానీ.అప్పుడప్పుడు కొంత మంది హీరోలు ప్లాప్ ఇచ్చిన కథనాయికలని కూడా నెక్స్ట్ సినిమాకు ఒకే చేస్తున్నారు. అదే తరహాలో మేఘా ఆకాష్ కు అవకాశం ఇచ్చాడు నితిన్. నితిన్ హీరోగానే కాకుండా ఓ విధంగా చిత్ర నిర్మాత కూడా అని అందరికి తెలిసిందే.
చల్ మోహన రంగ సినిమాలో నితిన్ మేఘా ఆకాష్ ని తీసుకోవడానికి కారణం సినిమా చూస్తే అర్థమవుతుందని ఆ పాత్రలో ఆమె తప్ప ఎవరు సెట్ అవ్వరని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇకపోతే నితిన్ ఆలోచన కరెక్ట్ అని కూడా అందరు మెచ్చుకున్నారు. ఇక నితిన్ సినిమా హీరోగా నిర్మాతగా కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన ప్రవర్తన షూటింగ్ సమయంలో ఎలా ఉంటుందనే డౌట్ అందరికి రావచ్చు. అయితే ఆ విషయంపై హీరోయిన్ మేఘా ఆకాష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చింది.
ఆయన ఒక నిర్మాత హీరో అనే ఫీలింగ్ ని ఎక్కడా చూపించారు. సినిమా షూటింగ్ లో అందరితో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. ఆయనతో లై సినిమా చేసినప్పుడు ఆయన ప్రవర్తన గురించి తెలుసుకున్నందువల్లే చల్ మోహన రంగ కాన్సెప్ట్ వినగానే ఒకే చేసినట్లు మేఘా ఆకాష్ తెలిపింది. ఇక సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో పాటలు కొన్ని ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa