కరోనా క్రైసిస్ కష్ట కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో ఉన్న కార్మికులకు శుభవార్తను అందింది. ఫెడరేషన్ లో సభ్యులైన వారి కుటుంబాల్లో స్కూల్.. కాలేజీ చదివే పిల్లలకు అర్హులైన వారికి ఉచిత స్కాలర్ షిప్ అందించేందుకు ప్రభుత్వ ప్రకటన జారీ అయ్యింది.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేస్తున్న సినీ కార్మికుల పిల్లలకు 2021-2022 సంవత్సరానికి గాను ఉపకార వేతనము లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రభుత్వము లేదా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదివే విద్యార్థులు దీనికి అర్హులు అని ప్రకటించింది. విద్యార్థులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లోకి వెళ్లి scholarship.gov.in website లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రీమెట్రిక్ స్కాలర్ లకు 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ 15 అక్టోబర్ చివరి తేదీగా ప్రకటించగా.. మెట్రిక్ తర్వాత ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 30 అక్టోబర్ వరకూ ధరఖాస్తు చేసుకోవచ్చు. 040-24658026 ప్రభుత్వ ఫోన్ నంబర్ ని దీనికోసం సంప్రదించవచ్చు. helpdesk@nsp.gov.in మెయిల్ ద్వారా సంప్రదింపులు జరపవచ్చని ప్రకటన వెలువడింది.
కార్మిక సమాఖ్యలో వేలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్నవారికి ఈ ప్రకటన ఈ కష్ట కాలంలో ఎంతో ఉపయుక్తం అనడంలో సందేహమేం లేదు. ఇక సినీకార్మికులు కరోనా క్రైసిస్ వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ సినిమాల షూటింగులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఆ క్రమంలోనే ఉపాధి కరువైన పరిస్థితి ఉంది. చిత్రపురి సహా ఫిలింనగర్ కృష్ణానగర్ లో కరోనా బాధితుల సంఖ్య కూడా అధికంగా నే ఉంది. ఇది ఆర్థిక క్రైసిస్ కి కారణమైంది. ఇక కరోనా క్రైసిస్ కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ కొద్దిరోజుల నిత్యావసరాలకు సాయపడిన సంగతి తెలిసిందే. ఈ సాయానికి కార్మికుల సమాఖ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa