సమంత.. క్యూట్‌గా.. బబ్లీగా కనిపించే హీరోయిన్. ఏ క్యారెక్టర్నయినా అవలీలగా చేయగలదని ప్రేక్షకులకు తెలిసిందే. తన అందమైన లుక్స్‌తో ఏ హీరోన్నయినా డామినేట్ చేయగలదు. అలాంటి సమంత పెళ్ళయిన తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రంగస్థలం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పూర్తయి ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. హీరోగా రామ్ చరణ్‌తో పాటు జగపతిబాబు, ఆది, అనసూయలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.అయితే సమంత మాత్రం తాను చాలా గ్యాప్ తరువాత నటించిన రంగస్థలం సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని, తన హావభావాలతో యువత హృదయాలను కొల్లగొట్టడం ఖాయమంటోంది. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు వున్న క్యారెక్టర్ ఇది. గ్రామంలో యువతులందరూ ఒక్కటైతే ఎలా ఉంటారోనన్నది సినిమాలో ఉంటుంది. యువతలందరికీ లీడర్‌ను నేనే. నేను వారిని ఆటపట్టించడం.. మేమంతా కలిసి కొంతమంది యువకులను ఆటపట్టించడం చూస్తే మాత్రం అందరికీ బాగా నచ్చుతుంది అంటోంది సమంత. మరి చూడాలి ఈ సినిమాతో సమంతకు నిజంగానే మంచి పేరు వస్తుందో లేదో..?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa