మెగా అభిమానులంతా ఈ నెల 27వ తేదీ కోసం ఆత్రుతగా వేచిచూస్తున్నారు . ఆ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి మెగా అభిమానులను వరుస కానుకలు పలకరించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' సమయంలోప్రభాస్, రానా, అనుష్క పుట్టిన రోజున వారికి సంబంధించిన స్టిల్స్ ను రాజమౌళి రిలీజ్ చేశారు.
అలాగే చరణ్ పుట్టినరోజున తమ మూవీకి సంబంధించి ఆయన స్టిల్ ను రాజమౌళి విడుదల చేయవచ్చని అంటున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన టెస్ట్ షూట్ నుంచి ఆ స్టిల్ రావొచ్చని చెబుతున్నారు. ఇక బోయపాటితో చరణ్ చేస్తోన్న మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ రావొచ్చని అంటున్నారు. 'సైరా' సినిమాకి చరణ్ నిర్మాత కనుక, ఆ మూవీ నుంచి కూడా ఒక స్పెషల్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక 'రంగస్థలం' నుంచి ఒక ట్రైలర్ రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకు ఇంతకి పండగ ఏముంటుంది ?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa