ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజిని 'అన్నాత్తే' నుంచి రేపు ఫస్టులుక్ విడుదల!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 09, 2021, 07:10 PM

రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై 'అన్నాత్తే' సినిమా రూపొందింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను .. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.


రేపు ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ పోస్టర్ ను .. రేపు సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. అంటే రేపు రజనీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే రోజనే చెప్పాలి. ఈ సినిమాలో ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. ఒక్క కీర్తి సురేశ్ మినహా మిగతా వాళ్లంతా గతంలో రజనీ జోడీగా హిట్లు అందుకున్నవారే. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ చేసిన ఈ ప్రయోగం మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa