క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లుఅర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. అయితే కథలో కొన్ని మార్పులతో పాటు కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రలో టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ నటించబోతుందని తెలుస్తోంది. ఆమెది బన్నీకి చెల్లిలి పాత్ర టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa