ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాతో ఆయన పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మణ్.కే కృష్ణ దర్శకుడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాకు 'స్వాతి ముత్యం' అనే టైటిల్ ని ఖరారు చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో గణేష్ కూల్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్, టైటిల్ చూస్తే అతడు తొలి సినిమాతోనే హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa