అందాల చిన్నది తాప్పీ నటిస్తున్న తాజా చిత్రం 'రష్మీ రాకెట్'. గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రష్మీ అనే అధ్లెట్ కథ ఇది. దసరా కానుకగా ఈ సినిమా జీ 5 ద్వారా అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కాస్తంత రచ్చ జరిగింది. ఇందులో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీలో మగరాయుడు కనిపించాడంటూ కొందరు చేసిన విమర్శకులు తనదైన బాణీలో బదులిచ్చింది తాప్సీ పన్ను.
తాజాగా ఈ మూవీలోని డాన్స్ నంబర్ ను విడుదల చేశారు. 'ఘనీ కూల్ చోరీ.' అంటూ సాగే ఈ పాట జానపద గీతాలను గుర్తు తెచ్చేలా ఉంది. కథానుగుణంగా కచ్ ప్రాంతంలో ఓ పండగ వాతావరణంలో తాప్సీ ఈ పాట పాడినట్టు తెలుస్తోంది. ఈ పెప్పీ నంబర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఇది అధ్లెట్ కు సంబంధించిన కథ మాత్రమే కాదు. అందులో లవ్ ఫ్లేవర్ కూడా కొంత ఉందని ఈ పాట ద్వారా తెలుస్తోంది. తాప్సీ పోషించిన రష్మీ పాత్ర కాస్తంత కూల్ గానే మొదలవుతుందనే భావనా ఈ పాట కలిగిస్తోంది. అలాంటి ఆమె అధ్లెట్ గా మారిన తర్వాత జండర్ విషయంలో ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొందనే దానిని డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా ఆసక్తికరంగా తెరకెక్కించారని అంటున్నారు. నంద పెరియసామి, అనిరుద్ధ్ గుహ, కనికా థిల్లాన్ రచన చేసిన ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రాంజల్ ఖంధియా నిర్మించారు. తాజాగా విడుదలైన కలర్ ఫుల్ సాంగ్ కు అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చగా, భూమి త్రివేది దీనిని గానం చేశారు. దీనిని కౌశర్ మునీర్ రాశారు. మరి తన గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి అథ్లెట్ రష్మీ చేసే పోరాటానికి వ్యూవర్స్ నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Put your garba shoes on coz…
Todi nakhyu fodi naakhyu bhukko bolaavi didho#GhaniCoolChori from #RashmiRocket out now! And I shall see u all this Dussehra only on #Zee5 https://t.co/zeKwomBd9d
— taapsee pannu (@taapsee) September 28, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa