జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి “పుట్టెనే ప్రేమ” అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సాంగ్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సినిమాలో బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa