టాలీవుడ్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్లపై దృష్టి పెట్టారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్టు గతంలో వార్తలు వైరల్ కాగా తాజాగా ఆ వార్తలు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు 'జై బావ్ రే' అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. తారక్ ఈ సినిమాపై ఆసక్తి చూపుతుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులు కూడా నటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతుంది .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa