దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నందున ఒక్కో అప్డేట్ ని మేకర్స్ నెమ్మదిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ఫస్ట్ సాంగ్ “ఈ రాతలే” మంచి రెస్పాన్స్ ను అందుకొని కొనసాగుతుంది. ఇక ఇప్పుడు రెండో చార్ట్ బస్టర్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ సారి సాంగ్ ని కూడా మంచి విజువల్స్ తోనే చూపిస్తారంట. అంతే కాకుండా ఈసారి సాంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించగా దీనిని ఈ డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చెయ్యనున్నారట. అలాగే ఇది సౌత్ వెర్షన్ వరకు మాత్రమే కూడా కావచ్చు. మరి వేచి చూడాలి ఇదెలా ఉంటుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa