నందమూరి బాలకృష్ణ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఇక 48 గంటల్లోనే తెరపడనుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'అఖండ'లో నటసింహాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారో చూడాలని వారు చాలా ఉత్సుకతతో ఉన్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా, యూఎస్‌లో నివసిస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు డిసెంబర్ 1న గ్రాండ్ ప్రీమియర్ షోలకు సిద్ధమవుతున్నారు.యుఎస్‌లో 500కి పైగా లొకేషన్లలో విడుదల కానుందని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలిపింది. డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa