నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరై. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రీమియర్స్ తర్వాత ప్రతి రోజు కూడా యూఎస్ లో మినిమమ్ 50 వేల డాలర్లును రాబడుతూ ఇదే నిలకడగా కొనసాగుతూ వెళుతుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా అక్కడ 7 లక్షల 50 వేల డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇంకా కొన్ని రోజుల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో శ్యామ్ సింగ్ రాయ్ హవా కొనసాగుతుందనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa