రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'శేఖర్'. జీవిత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు 'లవ్ గంటే' అనే మొదటి పాట విడుదల కానుంది. ఈ పాటకి అనూప్ రూబెన్స్ సాహిత్యానికి చంద్రబోస్ సాహిత్యం అందించారు.'శేఖర్' సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa