కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం. గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు టైమ్ బాగాలేదు. కాగా, డ్రగ్స్ కేసులో సంజన అరెస్టయింది. జైలుకు వెళ్లడం, బెయిల్‌పై బయటకు రావడం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె సినీ కెరీర్ కొంతవరకు మసకబారింది. ఈ క్రమంలో తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఆమె గర్భవతి అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్త నిజమో కాదో క్లారిటీ రాకముందే... ఆమెకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సంజన మండిపడింది. నాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వైవాహిక జీవితం హాయిగా ఉందని ... మా వ్యక్తిగత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa