రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మరియు S.S రాజమౌళి తమ రాబోయే ఎపిక్ 'ఆర్ ఆర్ ఆర్ ' ని చురుగ్గా ప్రమోట్ చేస్తున్నారు, తాజాగా ఈ చిత్ర బృందం 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు. ఆలియా భట్‌తో పాటు ముగ్గురూ ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు విపరీతమైన అభిమానం ఉందనే అంశాన్ని హోస్ట్ కపిల్ శర్మ తీసుకొచ్చారు. ఆ సంభాషణలలో ఒకదానిలో, జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ఈవెంట్‌లలో ఒకదానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, దానిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించాడు. "నా సినిమా 'ఆంధ్రావాలా' కోసం మేము ఒక ఈవెంట్‌ను నిర్వహించాము. 8-9 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు. అంతే కాదు, ఇంత భారీ జనసమితిలో కూడా ఒక్క దుర్ఘటన కూడా జరగలేదు. ఇది ఎప్పటికి గుర్తుండిపోయే విషయం. అని 'ఎన్టీఆర్ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa