స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం పెంచేందుకు చైనీస్ బ్రాండ్లు 7000mAh, 10000mAh బ్యాటరీలతో ఫోన్లను విడుదల చేశాయి. ఇప్పుడు సామ్ సంగ్ కూడా 20,000mAh బ్యాటరీతో ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాటరీ డ్యూయల్-సెల్, సిలికాన్-కార్బన్ టెక్నాలజీపై ఆధారపడి, 12,000mAh, 8,000mAh బ్యాటరీలను కలిపి రూపొందించారు. అయితే, పరీక్షల్లో ఈ బ్యాటరీ తక్కువ లైఫ్, త్వరగా ఉబ్బడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సామ్ సంగ్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa