నటసింహ నందమూరి బాలకృష్ణ యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ చిత్రంలో మరో లేడీ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రకు వరలక్ష్మి పాత్రకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో దర్శకుడు గోపీచంద్ అదే కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa