శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హీరో. జనవరి 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఘట్టమనేని మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు మృతి చెందడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపడింది. మేరకు మేకర్స్ అనౌన్స్ చేశారు. శనివారం సాయంత్రం రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa