పూరీ తమ్ముడు సాయిరాం శంకర్ '143' సినిమాతో హీరోగా తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.అయితే తాజాగా ‘ఒక పథకం ప్రకారం’అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి వినోద్ విజయన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ని రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు.ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో శృతి సోధి, సముద్ర ఖని, కళాభవన్ మణి,భాను శ్రీ మరియు పల్లవి గౌడ కీలక పాత్రలులో నటించారు. ఈ సినిమాని వినోద్ విజయన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa