ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ అంచనాలతో కమలహాసన్ విక్రమ్ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 06:21 PM

నటనలో ప్రయోగాలు చేసే కమల్ హాసన్ కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమలహాసన్ కథానాయకుడిగా ఆయన తాజా చిత్రంగా 'విక్రమ్' రూపొందింది. తన సొంత బ్యానర్ పై కమల్ నిర్మించిన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. కమల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇక్కడి సినిమాల మాదిరిగానే ఆదరిస్తారు. కమల్ ను ఒక పరభాషా నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అనుకోలేదు. అందువలన ఆయన సినిమాలు ఇక్కడ భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. అలాగే తమిళంతో పాటు తెలుగులోను 'విక్రమ్' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ స్థాయి రేటుకు ఈ సినిమా కొనుగోలు జరగడానికి కారణం కమల్ కి గల క్రేజ్ తో పాటు, దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ కూడా తోడైందని అంటున్నారు. ఇక విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ వంటి ఆర్టిస్టులు ఉండటం కూడా మరో కారణమని చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa