తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) కాసేపటి క్రితం మరణించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందికొండ యాదగిరి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యంపై తనకున్న ఆసక్తి నేపథ్యంలో ఆయన తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రముఖ హీరో రవితేజ లీడ్ రోల్‌గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం"లో "మళ్లి కూయవే గువ్వా.." అన్న పాటతో కందికొండ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇడియట్, సత్యం, పోకిరి, లవ్‌లీ, నీది నాది ఒకే కథ.. తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa