సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు ముందు,మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఇది బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.కాబట్టి,'RRR' డాల్బీ సినిమాలో విడుదల కానుంది. భారతదేశంలో,ఈ ఫీచర్‌తో కూడిన థియేటర్ అందుబాటులో లేదు.ఈ హై బడ్జెట్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa